జగన్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు

రోజుకో మాట మాట్లాడుతున్న చంద్ర‌బాబును చూస్తుంటే అల్జీమ‌ర్స్ వ్యాధి వ‌చ్చిందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ విమ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన [more]

Update: 2019-02-13 07:34 GMT

రోజుకో మాట మాట్లాడుతున్న చంద్ర‌బాబును చూస్తుంటే అల్జీమ‌ర్స్ వ్యాధి వ‌చ్చిందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ విమ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న బుధ‌వారం లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చంద్ర‌బాబు ఒక కులం గుత్తాధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. పొద్దున లేస్తే చంద్ర‌బాబు చెప్పే అబ‌ద్దాలు కూడా తాను పార్టీ మారేందుకు కార‌ణ‌మ‌న్నారు. ఓట్ల కోసం ఎన్నిక‌ల ముందు ప‌థ‌కాలు పెట్టి ఓట‌ర్ల‌ను కొనాల‌నే దుర్మార్గ ఆలోచ‌నలు న‌చ్చ‌లేద‌ని పేర్కొన్నారు. నీచ‌మైన టీడీపీ కుల‌త‌త్వాన్ని ప్ర‌శ్నించ‌డానికే వైసీపీలో చేరుతున్నాన‌ని,

జ‌గ‌న్ ను మించిన ప్ర‌త్యామ్నాయం లేదు

రాష్ట్రంలో జ‌గ‌న్ కు మించి ప్ర‌త్యామ్నాయం లేద‌న్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ అద్భుతం అంటూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కీర్తించిన చంద్ర‌బాబు మ‌ళ్లీ మాట మారుస్తార‌ని, ఆయ‌న రోజుకో మాట మారుస్తున్నార‌ని పేర్కొన్నారు. అనుభ‌వం ఉంది క‌దా అనే ఒకే ఒక్క కార‌ణంతో అధికారం అప్ప‌గిస్తే ప‌దేళ్లు కొట్లాడి సాధించుకున్న ఉమ్మ‌డి హైద‌రాబాద్ నుంచి పారిపోయి వ‌చ్చార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి అభివృద్ధి గురించి సాధార‌ణ ఉద్యోగుల‌ను అడిగితే వాస్త‌వ ప‌రిస్థితులు తెలుస్తాయ‌ని, మీడియా మేనేజ్ మెంట్ తో త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తున్నార‌ని అన్నారు. ఇంకా చాలామంది టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Tags:    

Similar News