చంద్రబాబుకు కులపిచ్చి లేదా..?

తనకు కులాన్ని ఆపాదిస్తున్నారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ… కులపిచ్చి ఉందో [more]

Update: 2019-02-14 11:54 GMT

తనకు కులాన్ని ఆపాదిస్తున్నారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ… కులపిచ్చి ఉందో లేదో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు చుట్టూ కులం విష వలయంలా తయారై రాష్ట్రాన్ని పెకిలించేస్తోందని ఆరోపించారు. పార్టీ, పరిపాలనా, పోలీస్ యంత్రాంగాన్ని చంద్రబాబు స్వంత సామాజకవర్గంతో నింపి అక్రమ మార్గంలో ప్రభుత్వంలోకి రావాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ప్రజలు, తమలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరన్నారు. ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవులు వంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం చంద్రబాబు సామాజకవర్గంలో చేతిలోనే ఉంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 20 మంది సెంట్రల్ సర్వీసెస్ అధికారులను డిప్యుటేషన్ పై తీసుకువస్తే అందులో 17 మంది చంద్రబాబు సామాజకవర్గం వారే కాదా అని ప్రశ్నించారు. కులానికి మాత్రమే సేవ చేయడానికి చంద్రబాబు ఉన్నారని, రాష్ట్రం కోసం కాదని పేర్కొన్నారు.

Tags:    

Similar News