ఇంకెన్నాళ్లిలా?
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 52వ రోజుకు చేరుకుంది. గత 52 రోజులుగా రైతులు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆందోళన చేస్తున్నారు. [more]
;
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 52వ రోజుకు చేరుకుంది. గత 52 రోజులుగా రైతులు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆందోళన చేస్తున్నారు. [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 52వ రోజుకు చేరుకుంది. గత 52 రోజులుగా రైతులు అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తప్పించి వైసీపీ నేతలు ఎవరూ రైతుల వద్దకు రాలేదు. రైతులు మాత్రం మొక్కవోని దీక్షతో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు కేంద్రంలోని పెద్దలను కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతుండటం విశేషం. తుళ్లూరు, మందడం గ్రామాల్లో ధర్నాలు నేడు కూడా కొనసాగనున్నాయి.