వారిపై ఏపీ సీఐడీ కేసు నమోదు
జడ్జి ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసులు నమోదు చేసింది. మొత్తం 49 మంది పైన కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది [more]
జడ్జి ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసులు నమోదు చేసింది. మొత్తం 49 మంది పైన కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది [more]
జడ్జి ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసులు నమోదు చేసింది. మొత్తం 49 మంది పైన కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది . జడ్జి ల పై పైన వ్యాఖ్యలు చేయడాన్ని హైకోర్టు నిన్న తీవ్రంగా పరిగణించింది . మొత్తం నలభై తొమ్మిది మందికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటుగా సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ రెడ్డి సిఐడి కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మొత్తం 49 మంది పైన సిఐడి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది . ఇందులో ఐటి యాక్ట్ , ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో జడ్జి ల పై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాజకీయంగా కూడా హంగామా జరిగింది. ఈ 49 మందిలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేశారు.