హత్య చేసినా బీసీ నేత అని వెనకేసుకొస్తారా?

బీసీ నేతలను ప్రభుత్వం వేధిస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, చనిపోయిన వ్యక్తి బీసీ కాదా అని మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు. హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర [more]

Update: 2020-07-06 08:43 GMT

బీసీ నేతలను ప్రభుత్వం వేధిస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, చనిపోయిన వ్యక్తి బీసీ కాదా అని మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు. హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని స్పష్టంగా తెలియడంతోనే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏమీ చేయకపోతే గోడదూకి పోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. చనిపోయిన వ్యక్తి కూడా ఒక బీసీయేనని స్పష్టం చేశారు. అలాగే అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడితే బీసీ అని బయటకు తెస్తున్నారన్నారు. అవినీతి, హత్య కేసుల్లో ఇరుక్కున్న వారికి బీసీ కార్డును అంటగట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు అనిల్ కుమార్ యాదవ్. హత్యా రాజకీయాలను చంద్రబాబు సమర్థిస్తారా? అని ఆయన నిలదీశారు.

Tags:    

Similar News