ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని రాష్ట్ర ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో సుపరింటెండెంట్ గా పనిచేస్తున్న రమణేశ్వర్ అనే వ్యక్తి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏపీ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జయలక్ష్మీ స్టీల్స్ యాజమాని గిరిబాబు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోకి సీబీఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ జీఓ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన మొదటి కేసు ఇది.