Telagngana : రేవంత్ కీలక నిర్ణయం.. హైదరాబాదీలకు గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-01-12 02:08 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ విద్యుత్తును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అథ్యయనం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ దేశాల్లో ఉన్న విద్యుత్తు విధానాన్ని పరిశీలించి త్వరలోనే తనకు నివేదిక ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల అంతా అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అత్యుత్తమ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాలని కోరారు. దీనివల్ల తరచూ నిర్వహణతో పాటు మరమ్మతులు కూడా తగ్గుతాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అందమైన నగరంగా...
అలాగే హైదరాబాద్ నగరంలో ఏ కేబుల్ కూడా బయటకు కనపడకుండా ఉండేలా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా దీనిని నిర్మించాలని, అండర్ గ్రౌండ్ టేబుల్ నిర్మాణం జరిగితే విద్యుత్తు శాఖకు ఇప్పుడు వచ్చే నష్టాలు కూడా తగ్గుతాయని తెలిపారు. విద్యుత్తు చౌర్యం కూడా కుదరదని ఆయన అన్నారు. ఇందుకోసం వివిధ దేశాల్లో అథ్యయనం చేసి తనకు నివేదిక అందిస్తే అందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పట్టినా విద్యుత్తువైర్లతో పాటు కేబుల్ వైర్లతో ఇబ్బందిగా మారిందిని వీటిని తొలిగించేవిధంగా చర్యలు తీసుకుని, హైదరాబాద్ నగరాన్ని అందమైన నగరంగా తీర్చి దిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వచ్చే వేసవిలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తుకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Tags:    

Similar News