ఎన్నికల వేళ ఏపీ క్యాబినెట్ వరాలు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించాలని నిర్ణయించింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు [more]
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించాలని నిర్ణయించింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు [more]
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించాలని నిర్ణయించింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు అకట్టుకునేందుకు గానూ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతి రైతు కుటుంబానికి ఖరీఫ్, రబీ సీజన్‌లకు కలిపి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు ఏపీ ప్రభుత్వం అదనంగా రూ.4 వేలు కలిపి ఇవ్వనుంది. ఈ నెలలోనే చెక్కుల పంపిణీ జరపాలని భావిస్తోంది. అమరావతిలో జర్నలిస్టులకు ఇళ్ల సక్థలాల కోసం ఎకరానికి 10 లక్షలకు మొత్తం 30 ఎకరాలు కేటాయించింది. ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు గజానికి రూ.4 వేలకు ఒక్కొక్కరికి 175 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.