ఏపీలో మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

Update: 2023-05-21 01:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. .పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి దీని ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది.

పిడుగులు పడే...
ఈరోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలతో పాటు ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News