ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల డేట్‌ ఫిక్స్‌!

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల డేట్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల సంఘం ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

Update: 2023-12-22 08:14 GMT

 AP elections

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల డేట్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల సంఘం ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

లోక్‌సభ ఎన్నికలను కాస్త ముందుగా జరపాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. అయోధ్య రామాలయం ప్రతిష్ట అనంతరం, జనం ఆ మూడ్‌లో ఉండగానే ఎన్నికలకు వెళ్లాలని మోదీ టీం భావిస్తోంది. జనవరి 22న అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట పూర్తికాగానే ఎన్నికల సంఘం తన ఏర్పాట్లను ప్రారంభించనుంది. ఈ లోగానే ఎన్నికల సంఘం ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను మార్చి మూడో వారానికల్లా పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైనా పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మే నాటికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి. 

Tags:    

Similar News