కరీంనగర్ జైలుకు బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు
బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. బెయిల్ పిటీషన్ పై నేడు కోర్టులో విచారణ జరుపుతామని చెప్పడంతో ఆయనను జైలుకు తరలించారు. బండి సంజయ్‌కు మెజిస్ట్రేట్ పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీని పోలీసులు ఉపయోగించరాని, పోలీస్ స్టేషన్లను తిప్పుతూ తననూ శారీరంగా వేధించారని జడ్జికి సంజయ్ వివరించారు. నేడు సంజయ్ బెయిల్ పిటీషన్‌ను విచారించనున్నారు.
భారీ భద్రత...
అంతకు ముందు హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హాజరుపర్చారు. హన్మకొండ మెజిస్ట్రేట్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో పోలీసులు విస్తృత బందోబస్తు చేపట్టారు. పోలీసులు, బండి సంజయ్ తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.
తనకు గాయాలు..
ఈ సందర్భంగా బండి సంజయ్ తన చొక్కా విప్పి తనకు అయిన గాయాలను చూపించినట్లు తెలిసింది. పోలీసుల తీరుతో పాటు తనను అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా న్యాయవాదులకు సంజయ్ చెప్పినట్లు సమాచారం. తన ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది. నాన్ బెయిల్‌బుల్ సెక్షన్లు బండి సంజయ్‌పై పోలీసులు పెట్టారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చారు.