గాజులు కాదు భూములిస్తే బాగుండేది

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజధాని రైతులకు సంఘీభావంగా అక్కడికి వచ్చిన నారా భువనేశ్వరి తన చేతి గాజులు ఇచ్చిన సంగతి [more]

Update: 2020-01-02 08:24 GMT

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజధాని రైతులకు సంఘీభావంగా అక్కడికి వచ్చిన నారా భువనేశ్వరి తన చేతి గాజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బొత్స సత్యనారాయణ దీనిపై గాజులు ఇవ్వడం కాదని, దోచుకున్న భూములను తిరిగి ఇచ్చేలా భర్త చంద్రబాబుపై వత్తిడి తేవాలని బొత్స సత్యనారాయణ అన్నారు. గాజులిచ్చితే కుదరదన్నారు. ిఇక చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ పనికి మాలిన మాటలను మాట్లాడుతున్నారన్నారు. కులాల ప్రస్తావన తెస్తున్నారని, విశాఖలో రాజధాని పెట్టినా బాగుపడేది ఆ సామాజికవర్గం వారేనని బొత్స తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. కేవలం ఇన్ సైడర్ ట్రేడిింగ్ కు భయపడే చంద్రబాబు రాజధానిలో రోజుకోనాటకానికి తెరలేపుతున్నారన్నారు.

Tags:    

Similar News