వైఎస్ వివేకా హత్య కేసుపై

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గత కొద్ది నెలలుగా వైఎస్ వివేకా హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో [more]

Update: 2020-01-02 04:24 GMT

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గత కొద్ది నెలలుగా వైఎస్ వివేకా హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో తేల్చలేకపోయారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, నేటీ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినా కేసును ఓ కొలిక్కి తేకపోవడంతో దీనిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News