ఈడీ అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరి

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరిని నియమించింది

Update: 2022-08-10 13:22 GMT

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరిని నియమించింది. ఐఆర్ఎస్ అధికారి అయిన దినేష్ పరుచూరి 2009వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్రాన్స్ కో జేఎండీగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో దినేష్ పరుచూరి ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేశారు.

కీలక కేసులను విచారిస్తున్న....
హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ గోయల్ ను ముంబై కి బదిలీ చేశారు. ఐఆర్ఎస్ అధికారి అయిన దినేష్ పరుచూరి ఈ ఏడాది జులై నెలలో డిప్యూటేషన్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లోకి వచ్చారు. ముఖ్యమైన కేసులను విచారించే అభిషేక్ గోయల్ ను బదిలీ చేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. అభిషేక్ గోయల్ కార్వే చీటింగ్, లోన్ యాప్ కేసు, చీకోటి ప్రవీణ్ కేసులను విచారిస్తున్న సందర్భంలో ఆయన బదిలీ జరగడం పై చర్చ జరుగుతోంది. ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.


Tags:    

Similar News