రాష్ట్రంలో పేడ వృధా కాకూడదని, పేడ నుంచి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన పేడ గురించి క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఒక్క గంప పేడ కూడా దుర్వినియోగం కాకూడదని పేర్కొన్నారు. పేడ సేకరణ, తరలింపు, నిల్వ అంశాలపై కలెక్టర్లకు ఆయన పలు సూచనలు చేశారు. పేడ నుంచి సంపద సృష్టించేందుకు నిర్దేశించుకున్న 4.8 మెట్రిక్ టన్నుల పేడ సేకరణ లక్ష్యంలో 0.8టన్నులు మాత్రమే సేకరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పేడ సద్వినియోగం చేయాల్సిన బాధ్యత కలెక్టర్ లదే అని స్పష్టం చేశారు. వ్యవసాయ, హార్టీ కల్చర్ శాఖలు పేడ ద్వారా కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.