అధికారులకు బాబు స్వీట్ వార్నింగ్..!!
వ్యవస్థలను కాపాడుకోవడం, బాగు చేసుకోవడానికే తాను ప్రయత్నం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసమే తన [more]
;
వ్యవస్థలను కాపాడుకోవడం, బాగు చేసుకోవడానికే తాను ప్రయత్నం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసమే తన [more]
వ్యవస్థలను కాపాడుకోవడం, బాగు చేసుకోవడానికే తాను ప్రయత్నం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసమే తన పోరాటామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం పని కేవలం ఎన్నికలు నిర్వహించడమే అని, వారు ఆ పని చూసుకుంటే చాలని, తమ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొన్నారు. సీఎస్ కేవలం మూడు నెలలే ఉంటారని కానీ తమ పార్టీ 22 ఏళ్లు అధికారంలో ఉందని, తాను ఎన్నో ఎన్నికలు చూశానని పేర్కొన్నారు. సీఈఓ కూడా సంవత్సరమే ఉంటారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించవద్దని హితవు పలికారు. కేవలం ఎన్నికల విధుల వరకే అధికారులు ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేయాలని, పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులు తనకే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటే మాత్రం సహించేది లేదన్నారు. ఫాని తుఫాను ప్రభావాన్ని తమ టెక్నాలజీ ముందుగానే అంచనా వేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.