జగన్ రెడ్డి చోద్యం చేస్తున్నారా?

ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలుస్తుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందడం [more]

;

Update: 2021-04-26 06:02 GMT

ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలుస్తుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సబ్యులకు చంద్రబాబు సానుభూతిని వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ను అందించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని కోరారు.

Tags:    

Similar News