చంద్రబాబు బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా?

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం టీడీపీలో కలకలం రేపుతుంది. కొందరు నేరుగా తాము పోటీ చేస్తామని చెబుతుంటే, మరికొందరు పార్టీకి రాజీనామా [more]

;

Update: 2021-04-05 00:57 GMT

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం టీడీపీలో కలకలం రేపుతుంది. కొందరు నేరుగా తాము పోటీ చేస్తామని చెబుతుంటే, మరికొందరు పార్టీకి రాజీనామా చేసి వెళుతున్నారు. కొందరు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళుతున్నారు. ఇది గమనించిన అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగనుంది. ఎవరైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేయాలనుకుంటే కొనసాగవచ్చని పార్టీ ప్రకటన చేసే అవకాశముంది. లేకుంటే మరింత మంది పార్టీ నేతలు దూరమవుతారని భావిస్తున్నారు.

Tags:    

Similar News