జగన్ ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత [more]

;

Update: 2021-04-09 01:13 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రతి పనికీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన చెందారు. పెట్రోలు, వంట గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాలన్నీ జగన్ వేనని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    

Similar News