అరెస్ట్ లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

జగన్ ప్రభుత్వం అరెస్ట్ లపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ను [more]

;

Update: 2021-04-23 04:58 GMT

జగన్ ప్రభుత్వం అరెస్ట్ లపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ను ఖండించారు. పొరుగు రాష్ట్రానికి చెందని అమూల్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి చెందిన సంగం డెయిరీని దెబ్బతీసే యత్నంలో భాగమే ధూళిపాళ్ల అరెస్ట్ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు ఈ డెయిరీలో భాగస్వామిగా ఉన్నారని తెలియదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై గొంతు విప్పిన ప్రతిసారీ టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఆనవాయితీగా మారిందని, ధూళిపాళ్ల నరేంద్ర ను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News