ఎవరిచ్చారు మీకు అధికారం.. బాబు మళ్లీ అదే ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణానికి ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. అన్ని [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణానికి ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. అన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణానికి ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రం తగులబడుతున్నా ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారన్నారు. పదిశాతం వ్యాక్సిన్లు వృధా చేశారని చంద్రబాబు చెప్పారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయమంటున్నారని, ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పిల్లలు ప్రాణాలతో ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రం దారుణంగా నష్టపోయిందన్నారు. ఇంతటి విపత్కర సమయంలోనూ ఇళ్లు కూల్చడం, విపక్ష నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి అయిందన్నారు. ఈ పరిస్థితికి ఎవరు కారణమని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని పరీక్షలను రద్దు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. ఏపీ శవాల దిబ్బగా మారుతుంటే ప్రకటనలు ఇచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండి పట్టుదల వదలి పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.