చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'విద్యా దీవెన' స్కీమ్ నిధులను విడుదల చేశారు. సోమవరాం నగరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'విద్యా దీవెన' స్కీమ్ నిధులను విడుదల చేశారు. సోమవరాం నగరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ ఏడాదిఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి మొత్తం 9,32,235 మంది విద్యార్థులకు ఈ రీయంబర్స్‌మెంట్‌ను అందించారు. మొత్తం రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని, విద్యార్థులకే కాకుండా రాష్ట్ర ప్రజలకు రకరకాల పథకాలను రూపొందించి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తాడని ఆరోపించారు. ఇచ్చిన మాటలను ఏనాడు నిలబెట్టుకోలేదన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత అది చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో కుట్రలు, కుతంత్రాలే ఉంటాయని మండిపడ్డారు. అలాగే పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసుపై దాడి చేశారని తీవ్ర ఆక్రోశం వెల్లగక్కారు. దారుణమైన అబద్దాలు, కుట్రలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రరబాబేనని అన్నారు.
రాష్ట్రంలోదొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రతి రోజు ఏదో విధంగా కుట్రలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శరాజకీయాలు చేయడం, అల్లర్లు సృష్టించడం, కుట్రలకు దిగడం ఆయన సొంతమన్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను మోసం చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మెనిఫేస్టును సరిగ్గా అమలు చేయలేదని, ఎన్నికలు అయ్యాక ఇచ్చిన హామీలన్ని చెత్తబుట్టలోపడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల కోసం ఏ ఒక్క మంచి పథకమైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలు చేసేందుకుకే సరిపోతుందని దుయ్యబట్టారు.