Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాలో మీ పేరుందా? లేదా తెలయాలంటే?

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలు ప్రారంభమయింది. అనేక చోట్ల లబ్దిదారుల ఎంపిక జరిగింది;

Update: 2025-03-18 08:23 GMT
indiramma  housing, second list, beneficiaries, telangana.
  • whatsapp icon

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలు ప్రారంభమయింది. అనేక చోట్ల లబ్దిదారుల ఎంపిక జరిగింది. ఇప్పటికే తొలి జాబితాలో సొంత స్థలం ఉన్న వారిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం సులువుగా మారుతుందని భావిస్తున్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి జాబితాలో ఎంపికయిన లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో ఉంచి మరీ అభ్యంతరాలను కూడా స్వీకరించారు. నియోజకవర్గానికి తొలి విడతగా 3,750 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రెండో విడత జాబితా...
ఇక తాజాగా రెండో విడత లబ్దిదారుల జాబితా కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ప్రజా పాలన నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. రెండో విడత జాబితాలో సొంత స్థలం లేని వారిని కూడా ఎంపిక చేయడం, వారికి స్థలంతో పాటు ఇంటినిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపికపై కలెక్టర్లపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తమకు గత ఎన్నికల్లో సహకరించిన వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలంటూ కలెక్టర్ల వద్ద ఎమ్మెల్యేలు గట్టిగానే కూర్చుంటున్నారట.
ఇప్పటి వరకూ...
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ ఏడాది జనవరి 26వ తేదీన ప్రారంభించిన ప్రభుత్వం తొలి విడతలో 71,482 మంది లబ్దిదారులను ఎంపిక చేసింది. వారందరికీ ఇంటి నిర్మాణం కోసం అనుమతి పత్రాలను కూడా మంజూరు చేసింది. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఏడు వేల ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు అరవై ఎనిమిది లక్షల దరఖాస్తులు రావడంతో వాటిని వడపోసి రెండో జాబితాను కలెక్టర్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ జాబితాలోనైనా తమ పేరు ఉంటుందా? లేదా? అన్న టెన్షన్ లో లబ్దిదారులున్నారు. అయితే అందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా లబ్దిదారుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది.



Tags:    

Similar News