SlBC Accident : ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నది ఎవరికీ తెలియడం లేదుగా
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరుకుంది. అయితే రెస్క్యూ ఆరేషన్ కు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. రోబోల సాయంతో మృతదేహాలను వెలికి తీయడం కూడా సాధ్యం కావడం లేదు. టన్నెల్ లో రోబోల తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన ఏడుగురు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది.
నీరు ఉబికి వస్తుండటంతో...
నలభై మీటర్ల వద్ద ఇంకా నీరు ఉబికి వస్తూనే ఉంది. బురద కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పన్నెండు టీంలలో 650 మంది సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేస్తున్నారు. షిఫ్ట్ ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. వీలయినంత త్వరగా ఆపరేషన్ ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కానీ రోజురోజుకూ ఆపరేషన్ లో ఆటంకాలు ఏర్పడటంతో ఆలస్యమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇలా అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఆ ప్రాంతాన్ని గుర్తించినా...
డీవాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులను ఇంకా కొనసాగిస్తున్నారు. డీ 1, డీ2 ప్రాంతంలోనే మృతదేహాలను ఉన్నట్లు గుర్తించినప్పటికీ అక్కడకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. పరిస్థితులు ప్రమాదకరంగా మరింది. అందుకే సహాయక బృందాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. రోబోలను పంపంచి తవ్వకాలు ఎనిమిది అడుగుల లోతున తవ్వుతున్నప్పికీ ఫలితం కనిపించడం లేదు. తమ వారి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో తప్పిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.