తెలంగాణ పథకాలు భేష్
కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు
కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ప్రజల కోసం అనేక మంది ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలను అనుసరిస్తున్న విధానాలను అనుకరించడంలో తప్పు లేదన్నారు. ఢిల్లీలో అమలవుతున్న మొహల్లా క్లినిక్ లను తెలంగాణలో బస్తి క్లినిక్ లుగా ఏర్పాటు చేశారన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో స్కూళ్లను అధ్యయనం చేసి అక్కడ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. గవర్నర్లను ఉపయోగించుకుని బీజేపీ ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్, ఢిల్లీలోనూ ప్రవేశపెడతామని కేజ్రీవాల్ తెలిపారు.
దాడులతో భయపెడుతూ...
సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు ఎవరిపైన చేయించాలా? అన్న ఆలోచనలోనే ప్రధాని నిత్యం ఉంటారని అన్నారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఎవరినీ ప్రశాంతంగా పనిచేసుకోనివ్వడం లేదన్నారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతమని తెలిపారు. అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. అయినా బీజేపీకి ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. న్యాయంగా తమ పని తాము చేసుకుని వెళితే ఎవరికీ భయపడాల్సిన పని లేదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.