ఆ వార్తలు నిజం కాదన్న నేవీ

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ కు తరలింపుపై తాము అభ్యంతరం చెబుతున్నట్లుగా వస్తున్న వార్తలను నేవీ అధికారులు ఖండించారు. ఈరోజు ఉదయం టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరావు ఈ [more]

;

Update: 2020-02-22 14:25 GMT
నేవీ
  • whatsapp icon

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ కు తరలింపుపై తాము అభ్యంతరం చెబుతున్నట్లుగా వస్తున్న వార్తలను నేవీ అధికారులు ఖండించారు. ఈరోజు ఉదయం టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరావు ఈ విషయం వెల్లడించారు. విశాఖలోని మిలీనియం టవర్స్ కు సచివాలయం తరలించేందుకు నేవీ అభ్యంతరం తెలిపిందని, దేశ రక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని నేవీ సూచించినట్లు బోండా ఉమ తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ కూడా ఓకే చెప్పినట్లు ఆయన వివరించారు. అయితే తాజాగా ఈస్ట్రరన్ నేవల్ కమాండ్ దీనిపై స్పందించింది. అయితే తమకు దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందలేదని, అలాగే తాము అభ్యంతరం తెలియజేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Tags:    

Similar News