Telugu acadamy : ఈడీ చేతుల్లోకి తెలుగు అకాడమీ స్కాం కేసు

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దాదాపు 70 కోట్ల మేరకు తెలుగు అకాడమీలో స్కాం జరిగింది. ఈ కేసును [more]

;

Update: 2021-10-08 03:57 GMT

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దాదాపు 70 కోట్ల మేరకు తెలుగు అకాడమీలో స్కాం జరిగింది. ఈ కేసును సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేశారు. అయితే నిందితులంతా తాము కొల్లగొట్టిన కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ లో పెట్టినట్లు తెలిసింది. వీరంతా మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న అనుమానాలున్నాయి. దీంతో సీసీఎస్ పోలీసులు ఈడీకి సమాచారం అందించడంతో అధికారులు విచారణ చేపట్టనున్నారు.

Tags:    

Similar News