లాక్ డౌన్ పొడిస్తేనే బెటరట… మరో పదిహేను రోజులు
లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో కొన్ని రాష్ట్రాలున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళనలో ఉన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, [more]
లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో కొన్ని రాష్ట్రాలున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళనలో ఉన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, [more]
లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో కొన్ని రాష్ట్రాలున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళనలో ఉన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లా్ డౌన్ ను పొడిగించాలని భావిస్తున్నాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ ను విధించారు. అయితే లాక్ డౌన్ ను విధించినా పరిమితమైన మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. సోషట్ డిస్టెన్స్ ను పాటించగల వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలన్నది ముఖ్యమంత్రుల ఆలోచనగా ఉంది. మే 18వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరితో చర్చించిన తర్వాతనే మోదీ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. కానీ మూడో విడత లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశముంది.