ఈటల ఆత్మగౌరవానికి ఏం దెబ్బతగిలింది?

ఈటల రాజేందర్ కు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్షనేతగా, అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ, ఆర్థిక, వైద్య [more]

Update: 2021-05-05 00:58 GMT

ఈటల రాజేందర్ కు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్షనేతగా, అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖలను ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు. ఈటల రాజేందర్ కు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చిందని వారు తెలిపారు. ఆయన ఆత్మగౌరవానికి ఎక్కడ దెబ్బతగిలిందో తమకు అర్థం కావడం లేదన్నారు. మూడేళ్ల నుంచి పార్టీపైనా, కేసీఆర్ పైనా వ్యతిరేకంగా మాట్లాడింది ఆయననేని మంత్రులు చెప్పారు. ఈటల ఒక్కరే ఉద్యమంలో పాల్గొనలేదని, అనేక మంది ఉద్యమం కాలం నుంచి పనిచేస్తున్న వారికి ఇప్పటికీ కొందరికి పదవులు దక్కలేదన్నారు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కూడా ఈటల విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. సాగునీటి రంగంలో ముందున్నామని చెప్పారు. ఈటల చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వారన్నారు. అన్ని రకాలుగా పార్టీ ద్వారా ఈటల లబ్ది పొందారన్నారు. ఈటల రాజేందర్ బలహీన వర్గాల ముసుగులో ఉన్న దొర అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు మాట్లాడారు.

Tags:    

Similar News