Gulab : బలహీన పడిన వాయుగుండం..విస్తారంగా వర్షాలు

గులాబ్ తుపాను తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. రాగల ఆరు గంటల్లో మరింత బలహీనపడుతుందని విపత్తుల శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాగల ఆరు గంటల్లో ఏపీ [more]

Update: 2021-09-27 03:36 GMT

గులాబ్ తుపాను తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. రాగల ఆరు గంటల్లో మరింత బలహీనపడుతుందని విపత్తుల శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాగల ఆరు గంటల్లో ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖలో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. తీరం వెంట గంటకు నలభై నుంచి అరవై కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని పేర్కొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

Tags:    

Similar News