బ్రేకింగ్ : ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 3వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడు [more]

;

Update: 2020-01-08 07:34 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 3వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కోరింది. రెండుదశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆనెల 17న ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫడవిట్ ను హైకోర్టు ఆమోదించింది.

Tags:    

Similar News