హైదరాబాద్‌లో కుండపోత
హైదరాబాద్ వర్షానికి వణికి పోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఎనిమిది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది.
అన్ సీజన్‌లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వర్షానికి వణికి పోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఎనిమిది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. పలుచోట్ల రహదారులు నీటితో పొంగాయి. అకాల వర్షానికి రహదారులన్నీ పొంగిపొరలాయి. కుండపోత వర్షంతో నగరవాసులు భయపడిపోయారు. ఉక్కబోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించినా అనేకమంది మాత్రం ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు సౌకర్యానికి కూడా అంతరాయం ఏర్పడింది.
ఈదురుగాలులు...
కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో భీతావహ వాతావరణం కనపడింది. అనేక చోట్ల విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు తీగలు తెగి పడటంతో అనేక చోట్ల కొన్ని గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఏప్రిల్ నెలలో ఇదే అత్యధిక వర్షం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలపారు. అనేక చోట్ల బలమైన గాలులు వీయడంతో చెట్లు కూడా నేలకొరగాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం కూడా అదే వాతావరణం నెలకొని ఉండటంతో కార్యాలయానికి వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.