విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు చుక్కెదురైంది. తనపై హత్యాయత్నం కేసును స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారించిన కోర్టు... ఎయిర్ పోర్టులో సంఘటన జరిగితే మీరెలా విచారిస్తారని ప్రశ్నించింది. కేసును ఎందుకు ఎన్ఐఏకు బదిలీ చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసును బుధవారానికి వాయిదా వేసింది. అయితే, చట్ట ప్రకారం ఎయిర్ పోర్టు లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో సంఘటన జరిగితే ఎన్ఐఏ నే విచారించాలని జగన్ తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో ఎల్లుండి లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.