జగన్ నూ కలుపుకుంటామన్న జేసీ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కలసి వస్తే జగన్ ను కలుపుకుని పోవడానికి అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ [more]

;

Update: 2019-01-04 06:27 GMT

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కలసి వస్తే జగన్ ను కలుపుకుని పోవడానికి అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రా భివృద్ధి కోసం ఎవరినైనా కలుపుకుని పోయేందుకు సిద్ధమని చెప్పారు. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని, రాయలసీమ ఫ్యాక్షనిస్టులా మోదీ మారిపోయారని జేసీ విమర్శించారు. చంద్రబాబు అంటేనే మోడీకి భయం పట్టుకుందన్నారు. తమను పూర్తి కాలం బహిష్కరిస్తే బాగుండేదన్నారు. ప్రజాభిప్రాయం గౌరవించకుండా సస్పెండ్ చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News