జగన్, పవన్ లూ ఒక్కటేనన్న జేసీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు ఇద్దరూ ఒకే బాటలో నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి [more]
;
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు ఇద్దరూ ఒకే బాటలో నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు ఇద్దరూ ఒకే బాటలో నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలను చేస్తున్నారని, వారిద్దరూ కులాలనే నమ్ముకున్నారని జేసీ మరోసారి ఆరోపించారు. గత ఎన్నికల్లో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు స్మరించుకునే వారని, ఈ ఎన్నికల్లో కులాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా కులాన్నే నమ్ముకున్నారని అన్నారు. ఇక ఏపీకి బీజేపీలో ఎంతమాత్రం అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ కూడా పుంజుకోలేదన్నారు. ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికైనా వెళ్లవచ్చని, అయితే ఏపీకి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని జేసీ అభిప్రాయపడ్డారు.