ఇక కోదండరాంప్లాన్ అదేనంటారా...?

Update: 2018-04-30 02:30 GMT

ఆంధ్రోళ్లు వెళ్ళిపోవాలంటూ సెంటిమెంట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న టి సీఎం కేసీఆర్ కి నాటి ఉద్యమ కారులే చుక్కలు చూపించేలా వున్నారు. నాటి ఉద్యమంలో టి జేఏసీ ని ముందుండి విజయవంతంగా నడిపించిన కోదండరాం ఇప్పుడు కేసీఆర్ కి కంటిలో నలుసులా, పంటికింద రాయిలా మారారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరుగుతూ వచ్చిన కోదండరాం ఆయన సాగించే పోరాటాలపై ఉక్కుపాదం మోపిన టి సర్కార్ చర్యలకు నిరసనగా కొత్త పార్టీనే ఏర్పాడిపోయింది. తెలంగాణ జన సమితి పేరిట కోదండ రామ్ రాజకీయ పార్టీ పెట్టేసి టి సర్కార్ పై యుద్ధం ప్రకటించారు.

ఇప్పుడు కేసీఆర్ భాగో ....

పోరాడి సాధించుకున్న తెలంగాణ గడ్డ పై నుంచి కేసీఆర్ భాగో స్లోగన్ తో తెలంగాణ ప్రజా సమితి ఆందోళన స్టార్ట్ చేసేసింది. కేసీఆర్ ఇది ఊహించని పరిణామమే . గతంలో ఉద్యమం పీక్ కి వెళ్లేందుకు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఆయనకు తిప్పి కొడుతున్నారు కొత్త పార్టీ వారు. తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావ సభ సైతం వినూత్నంగా చేపట్టారు కోదండరాం. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను, పోరాట యోధులను వెయ్యి మందిని గుర్తించి ఒకే వేదికపై వారిని కూర్చో బెట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు కోదండరాం. ఆ వేదిక నుంచే తెలంగాణ ఆశయాలను పట్టించుకోకుండా కాంట్రాక్ట్ లు, కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని కనుక టిఆర్ఎస్ గద్దె దిగాలంటూ శంఖారావం పూరించి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు టి జాక్ అధ్యక్షుడు. మరి ఆయన కొత్త పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.

Similar News