హైకోర్టు తీర్పుపై కొడాలి నాని ఏమన్నారంటే?
హైకోర్టు తీర్పు పై మంత్రి కొడాలి నాని స్వాగతించారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సుదినమని ఆయన తెలిపారు. ప్రజలకు కరోనా ప్రబలకుండా హైకోర్టు ఈ నిర్ణయం [more]
హైకోర్టు తీర్పు పై మంత్రి కొడాలి నాని స్వాగతించారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సుదినమని ఆయన తెలిపారు. ప్రజలకు కరోనా ప్రబలకుండా హైకోర్టు ఈ నిర్ణయం [more]
హైకోర్టు తీర్పు పై మంత్రి కొడాలి నాని స్వాగతించారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సుదినమని ఆయన తెలిపారు. ప్రజలకు కరోనా ప్రబలకుండా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నిమ్మగడ్డ రమేష్ అనే శిఖండిని అడ్డంపెట్టి ఎన్నికలు జరపాలని చంద్రబాబు భావించారన్నారు. కరోనా ఎక్కువైతే ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టేందుకు చంద్రబాబు చూశారన్నారు. రిటైర్ అయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ టీడీపీలో చేరతారని కొడాలి నాని తెలిపారు. నిమ్మగడ్డ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కొడాలి నాని కోరారు. నిమ్మగడ్డకు కోర్టులు బుద్ధి చెప్పాయని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.