బ్రేకింగ్ : భయపడి బాబు పారిపోయాడు..కొడాలి నాని కామెంట్స్

నిత్యావసర వస్తువులు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచకపోవడానికి కారణాలు ఉన్నాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. బ్యాగ్ లు ఈ సమయంలో రెడీ చేయడం కష్టమవుతుందని కొడాలి [more]

Update: 2020-03-31 04:58 GMT

నిత్యావసర వస్తువులు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచకపోవడానికి కారణాలు ఉన్నాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. బ్యాగ్ లు ఈ సమయంలో రెడీ చేయడం కష్టమవుతుందని కొడాలి నాని తెలిపారు. ఎవరికి వారే తమ రేషన్ ను దుకాణాలను తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించాలని కొడాలి నాని కోరారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ను విమర్శించే వారిపై కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని గాలికొదిలేసి వైరస్ కు భయపడి హైదరాబాద్ కు పారిపోయి కుటుంబంతో అక్కడ తలదాచుకున్నారని అన్నారు. దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల చేత తప్పుడు విమర్శలు చేయిస్తున్నారన్నారు. ఎల్లో మీడియా కూడా వాలంటీర్ వ్యవస్థ పై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున అన్ని పార్టీలూ ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విమర్శలకు దిగడమేంటని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ ను సరఫరా చేస్తామని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదమన్నారు. చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. కాటికి కాళ్లు చాచిన నువ్వు ఊరకుక్కల ద్వారా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. సిగ్గులేకుండా విమర్శలకు దిగుతున్నారన్నారు. తమది పనిచేసే ప్రభుత్వమని, చంద్రబాబు లాగా ఆర్భాటపు ప్రచారం చేసుకోమని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News