బ్రేకింగ్ : వైసీపీపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు వైసీపీ నేతలే కొందరు కుట్ర పన్నుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. [more]

;

Update: 2019-10-06 05:39 GMT

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు వైసీపీ నేతలే కొందరు కుట్ర పన్నుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. తనపై ఎంపీడీవో సరళ చేత కేసు పెట్టించింది వైసీపీ మండల అధ్యక్షుడు అని ఆయన ఆరోపించారు. తనపై కేసు పెట్టించిన పెద్ద మనుషులు ఎవరో జగన్ తెలుసుకోవాలని సూచించారు. తాను ఎంపీడీవోకు అసలు ఫోన్ చేయలేదన్నారు. ఎస్పీ తనను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరయింది. కోటంరెడ్డిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఆయన బెయిల్ మంజూరు చేశారు.

Tags:    

Similar News