11July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ భారతీయ మార్కెట్లో మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కంపనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు మన దేశ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్త కారును బీవైడీ విడుదల చేసింది. 2024 అట్టో 3 ఈవీ పేరుతో తీసుకొచ్చింది.

Update: 2024-07-11 12:55 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

BYD Atto 3: తక్కువ ధరల్లోనే లగ్జిరి ఈవీ కారు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 521కి.మీ

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ భారతీయ మార్కెట్లో మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కంపనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు మన దేశ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్త కారును బీవైడీ విడుదల చేసింది. 2024 అట్టో 3 ఈవీ పేరుతో తీసుకొచ్చింది.

వల్లభనేని వంశీ కూడా నిందితుడే.. అరెస్టు తప్పదా?

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

ఏ1గా రాజ్ తరుణ్.. ఏ2గా హీరోయిన్ మాల్వీ

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.

Team India భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లే అవకాశమే లేదు.. తేల్చేశారు

టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న భారతజట్టు తర్వాతి టార్గెట్ ఛాంపియన్స్ ట్రోపీ. 2025లో పాకిస్థాన్ లో ఈ టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీ కోసం భారతజట్టు పాకిస్థాన్ లో కాలు పెట్టడం కుదరదని తాజాగా తేల్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరి-మార్చిలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అవకాశం ఉందని భారతజట్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

AP HighCourt: వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

Kuppam Politics: అసలు కుప్పంలో ఏమి జరుగుతోంది?

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు పలువురు పార్టీ మారుతున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ సుధీర్ అమరావతికి వెళ్లారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం సుధీర్ ఓ వైపు ఎదురుచూస్తూ ఉన్నారని తెలుస్తోంది.

Jio: రూ. 51కే 5G హైస్పీడ్‌ డేటా.. జియో నుంచి చౌక రీఛార్జ్‌ ప్లాన్స్‌

దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఇది కాకుండా, కంపెనీ ఉచిత అపరిమిత 5G ఇంటర్నెట్ సేవను కూడా ముగించింది. అయితే Jio అపరిమిత 5G డేటాను కేవలం 51 రూపాయలకే పొందవచ్చని మీకు తెలుసా? కంపెనీ మూడు చౌకైన ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది, ఇందులో రూ. 51 ప్లాన్ కూడా ఉంది.

Praneeth Hanumanthu: ప్రణీత్ అమెరికా పారిపోవాలనుకున్నాడా.. ఎలా పట్టుకున్నారంటే?

కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అదుపులోకి తీసుకుంది. బెంగుళూరులో పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

బడిలో భూతం అంటూ ప్రచారం.. టీచర్ ఏమి చేశారంటే?

అరె మన స్కూల్ లో దెయ్యం ఉందట రా..? నీకేమి తెలుసురా.. ఈ స్కూల్ ఒకప్పుడు శ్మశానం.. దాని మీదనే ఈ స్కూల్ ను కట్టారు. అవునురా.. నేను కూడా బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు నన్ను ఫాలో అయినట్లు అనిపించింది. భయం తో పాస్ కూడా పోసుకోకుండా వచ్చేశా!!

రెండు నెలల్లో.. హైదరాబాద్-విజయవాడ ఆరు లేన్ల హైవే!!

హైదరాబాద్-విజయవాడ ఆరు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65) నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు.

Tags:    

Similar News