12May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఓటర్లు క్యూకట్టారు. బస్సులు, రైళ్లలో వెళ్లలేని వారు సొంత వాహనాల్లో బయలుదేరారు. ప్రయివేటు బస్సుల్లో నలుగురు వెళ్లాలంటే సొంత వాహనంలో వెళ్లి రావడం బెటర్ అని భావించి చాలా మంది కార్లలో బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-05-12 13:29 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ 

రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఓటర్లు క్యూకట్టారు. బస్సులు, రైళ్లలో వెళ్లలేని వారు సొంత వాహనాల్లో బయలుదేరారు. ప్రయివేటు బస్సుల్లో నలుగురు వెళ్లాలంటే సొంత వాహనంలో వెళ్లి రావడం బెటర్ అని భావించి చాలా మంది కార్లలో బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.

Ap Elections : మహిళలే క్యూ కట్టారంటే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. మహిళలు ఎటు వైపు మొగ్గుచూపితే వారిదే అధికారం. గత ఎన్నికల్లోనూ మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలకు రాత్రి ఏడు గంటల వరకూ వస్తూనే ఉన్నారు.

Ap BJP : ఒక‌టా - రెండా - మూడా - ఏపీలో బీజేపీ ద‌క్కించుకునే అసెంబ్లీ సీట్లెన్ని..?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. మ‌రి వీటిలో ఎన్ని ద‌క్కించుకుంటుంది? ఎలా పోరాటం చేస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. పోటీ చేసే స్థానాల్లో ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేసినవి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. బ‌ద్వేల్‌, విజ‌యవాడ వెస్ట్‌, జ‌మ్మల‌మ‌డుగు, అర‌కు, ఆదోని, విశాఖ నార్త్‌, కైక‌లూరు, ధ‌ర్మవ‌రం, అన‌ప‌ర్తి, ఎచ్చెర్ల.

Cash Politics : డబ్బే అధికారాన్ని నిర్ణయిస్తుందా? ఏపీలో ఒక్కో ఓటుకు ఎంత రేటు పలుకుతుందంటే?

రాజకీయాలు డబ్బు మయం అయ్యాయి. సేవ అంతరించి పోయి క్యాష్ కొట్టు ఓటు పట్టు అనే చందంగా తయారయింది. ఎన్నికల కమిషన్ అధికారుల కళ్లు గప్పి మరీ ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. మ్యానిఫేస్టోలు, హామీలు, అభివృద్ధి.. ఉపాధి అవకాశాలు... పరిశ్రమల స్థాపన.. సంక్షేమ పథకాలు ఇవన్నీ ట్రాష్. ఎన్నికల రోజు అదే పోలింగ్ రోజు ఎవరు ఎంత ఖర్చు పెడితే వారిదే విజయం అన్న పరిస్థితికి రాజకీయాలు చేరుకున్నాయి.

Hyderabad Metro Rail : ఉచిత ప్రయాణం.. మెట్రో రైలు ఉసురుతీస్తుందా? ఇది నిజమేనా? లేక ప్రచారమా?

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడం సులువు కాదు. ఎప్పుడు బయటకు వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పవు. శని, ఆదివారాలు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వాహనాలు ముందుకు కదలడానికే ఇబ్బంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, రాయదుర్గం, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి వరకూ ఎక్కడ చూసినా రద్దీయే. గంటల కొద్దీ ప్రయాణం. సరూర్ నగర్ నుంచి కూకట్ పల్లికి వెళ్లివచ్చేసరికి కారులో విజయవాడ వెళ్లిపోవచ్చు అన్న సామెత అక్షర సత్యం.

IPL 2024 : అఫిషియల్ అనౌన్స్ మెంట్.. రైడర్స్ తిరుగులేని జట్టు

ఈసారి ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ లోకి అధికారికంగా ప్రవేశించింది. సీజన్ తొలి నుంచి ఆ జట్టు అన్ని జట్లను ఓడిస్తూ ముందుకు వెళుతుంది. పాయింట్ల పట్టికలోనూ అగ్రభాగాన ఉంటూనే వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది మ్యాచ్ లను గెలిచి పద్దెనిమిది పాయింట్లు సాధించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంది.

Andhra Pradesh : నేడు ఏపీలో భారీ వర్షాలు కురిసే ప్రాంతాలివే

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Chandrababu : ఎల్లుండి వారణాసికి చంద్రబాబు

మే 14న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాసికి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నారు. చంద్రబాబు కు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం అందడంతో మే 14వ తేదీన ఆయన వారణాిసి బయలుదేదరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Hyderabad : కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీ.. ఓటు వేయడానికి కదిలిన యువత

హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్ లు బోసిపోయి కనిపిస్తున్నాయి. వరగగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ తమ సొంతూళ్లకు వెళ్లారు. ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు అమీర్ పేట్ లో కోచింగ్ తీసుకుంటారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం నిత్యం ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు. ఇక్కడ శిక్షణ పొంది ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటారు. నిత్యం కిటికిటలాడుతూనే ఈ వీధి ఉంటుంది.

Liqour Death : మద్యం .. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఐదుగురిని చంపేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ కు చెందిన అనురాగ్ సింగ్ మద్యం లేనిదే బతికలేని పరిస్థితికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్యం మానాలని అనేక రకాలుగా వత్తిడి తెచ్చారు. చివరకు డీ అడిక్షన్ సెంటర్ లోనూ చేర్చడానికి ప్రయత్నించారు.


Tags:    

Similar News