13May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో అక్కడ క్యూ లైన్ లన్నీ నిండిపోయాయి.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఏపీలో పోటెత్తుతున్న ఓటర్లు.. డోలీలో తీసుకు వచ్చి మరీ?
ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో అక్కడ క్యూ లైన్ లన్నీ నిండిపోయాయి.
Ap Elections : పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం? ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు. దీంతో పెద్దయెత్తున పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే పది శాతం పోలింగ్ నమోదయింది. పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Ap Elections " ఏందయ్యా ఇది.. ఎప్పుడూ లేనంతగా ఓటర్లు ఊగిపోతున్నారుగా.. మహిళలు.. వృద్ధులే ఎక్కువగా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతగానే జరుగుతున్నాయి. అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిసింది. అయితే ఎవరికి వాళ్లు పెరుగుతున్న ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
YCP : వైసీపీ ఎమ్మెల్యే గృహనిర్బంధం.. ఈసీ సీరియస్
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఓటరు పై చేయిచసుకున్న వైసీపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆయనను పోలింగ్ పూర్తయ్యేంత వరకూ బయటకు రానివద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు.
Encounter : ఛత్తీస్‌గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోల మృతి
ఛత్తీస్‌గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారని తెలిసింది. సెమ్రా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులున్నారన్న సమచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లగా మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయినట్లు చెబుతున్నారు.
Accident : హోటల్ లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి మృతి
జనగామలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక టిఫిన్ సెంటర్ లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించినట్లు తెలిసింది. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయని చెబుతున్నారు. ఉదయం కావడంతో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో ఎక్కువ మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Revanth Reddy : కొడంగల్ లో ఓటు వేసిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన కొడంగల్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
IPL 2024 : గుజరాత్ కు మాత్రం డూ ఆర్ డై
ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు ఇప్పటికే కోల్‌కత్తా నైట్ రైడర్స్ చేరుకుంది. మిగిలిన జట్లు ప్లే ఆఫ్ లో ఉండేందుకు పోటీ పడుతున్నాయి. అన్ని జట్లు అలాగే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఉండగా, తర్వాత స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్, బెంగళూరు జట్లు ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, గుజరాత్ లు కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలని చెమటోడుస్తున్నాయి.
Telangana : గాలివాన బీభత్సం.. పోలింగ్ కు ప్రశాంత వాతావరణం
ఆదివారం రాత్రి తెలంగాణ అంతటా గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానతో పాటు వర్షం కురవడంతో పలు చోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరగాయి. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ప్రారంభమయిన గాలివాన దాదాపు అరగంట సేపు సాగింది. అనేక చోట్ల పిడుగులు పడి మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. అత్యధికంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 8.9 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.
Ys Jagan : ఓటు వేసిన జగన్... ట్వీట్ తో ఏం చెప్పారంటే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రజలకు తన సందేశాన్ని తెలియజేశారు.