16June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండే అవకాశం ఉంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Andhra Pradesh : ఏపీ శాసనసభ స్పీకర్ పేరు ఫైనల్.. ఆయన కే ఆ పదవి
ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండే అవకాశం ఉంది.
జీశాట్-ఎన్2 ప్రయోగం జులైలో
జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలిసింది.అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం జులై రెండో వారంలో దీనిని ప్రయోగించానలి భావిస్తున్నారు.
Guarantees : కర్ణాటకను చూస్తే తెలుగోళ్లకు కూడా భయమేస్తుందిగా.. గ్యారంటీలు తెచ్చిన బాధలు అంతా ఇంతా కాదయా?
కర్ణాటకలో వరసగా ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు డేంజర్ సిగ్నల్స్ పంపుతుంది. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలు అయిన తర్వాత తమ ఖజానాను నింపుకునేందుకు అనేక రకాలుగా పన్నులు పెంచుతూ వస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ మాత్రం పన్నులు పెంచకపోతే రాబడి ఎక్కడి నుంచి వస్తుందని కర్ణాటక పాలకులు ప్రశ్నిస్తున్నారు.
YSRCP : వైసీపీ ఒకటి తలిస్తే.. మరొకటి... జనం దారుణంగా దెబ్బకొట్టడానికి కారణం ఏంటంటే?
రాజకీయాల్లో ఏది కలసి వస్తుందని భావిస్తామో.. అదే ఒక్కోసారి ఎదురుతంతుంది. ఎన్నికల ముందు వరకూ తమకు అదే వరమని భావించినా.. చివరకు ఫలితాలు తేలేనాటికి శాపమని తేలుతుంది. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్మాణం చేపడతామని ప్రకటించారు.
Hyderabad : జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత.. అధికారిపై వేటు
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే తెలంగాణలో ఒక మంత్రి కీలకమైన మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఈ కూల్చివేతలు జరిగాయని చెబుతున్నారు.
Chandrababu : చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పనున్న సర్కార్...ఆ పన్ను రద్దు దిశగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు నాయుడు వరస నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి చంద్రబాబు తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటు తాను చేసిన విమర్శలను తన ప్రభుత్వంపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిపలో పెట్టుకుని ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ చేసినా ఇప్పుడు భారత్ లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చనీయాంశంగా మారింది.
Petrol : పెట్రోలు ధర లీటరుపై పది రూపాయలు తగ్గింపు
పెట్రోలు ధరలు తగ్గయాంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు. ఎందుకంటే రోజువారీ బండి ముందుకు కదలాలంటే పెట్రోలు, డీజిల్ అవసరమవుతాయి. వాహనంతో ఎక్కడకు వెళ్లాలన్నా పెట్రోలు అవసరం అందుకే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కు అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి పెట్రోలు ధరపై ధరలు తగ్గితే ఇంక ఎంత ఆనందం ఉంటుంది. అదే ఇప్పుడు పాకిస్థాన్ లో జరిగింది.
Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని త్వరలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తుంది. తెల్లకార్డు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులుగా ప్రకటించనున్నారని తెలిసింది.
రైతులకు ఖాతాల్లో ఆ నిధులు జమ అయ్యేదెప్పుడంటే?
దేశంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో డబ్బులు పడేది ఈ నెల 18వ తేదీ నుంచి అని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా ఈ సొమ్మును అందచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద తొలి విడతగా రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.