17June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్న భాషా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

Update: 2024-06-17 12:40 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్న భాషా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

YSRCP : జగన్ లో మార్పు రాదా? చేసిన తప్పులు ఒప్పుకుని తీరాల్సిన టైంలో కూడా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజుల నుంచి సమీక్షలు నిర్వహించారు. మొదటి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో, రెండో రోజు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఓటమి తర్వాత సమీక్షించుకోవడం తప్పు లేదు.

Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ రైలు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ ను వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం ఎనిమిదన్నర గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది.

Andhra Pradesh : భజన మానండి.. జనం బాట పడితేనే.. భవిష‌్యత్.. లేదంటే.. కామ్రేడ్స్ కనుమరుగే

ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది ఒక దారి అన్నట్లు తయారయింది ఆంధ్రప్రదేశ్ సీపీఐ పరిస్థితి. దేశంలో ఇండియా కూటమితో అది ప్రయాణిస్తుంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణలోనూ కాంగ్రెస్‌తో సీపీఐ జట్టు కట్టింది. ఫలితంగా తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టగలిగింది.

Vangaveeti Radha : వంగవీటికి సూపర్ న్యూస్.. తొలి జాబితాలో ఆయన పేరు.... అదిరిపోయే.... గిఫ్ట్‌ ఇవ్వనున్న చంద్రబాబు

విజయవాడ నేత వంగవీటి రాధాకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాకు సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకుని ఉండటం, ఓటమిపాలయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

Telangana : రైతు రుణమాఫీకి నిబంధనలు ఇవే.. ఇవి ఉంటేనే వర్తింపు.. కసరత్తు చేస్తున్న యంత్రాంగం

తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మ్యానిఫేస్టోలో రైతు రుణమాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

ఉద్యోగులకు వార్నింగ్..లేటుగా వస్తే యాక్షన్ గ్యారంటీ

ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిత్యం ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రావడంపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన సమయానికి ఆఫీసుకు రావాలని సూచించింది.

Telangana : ఐదు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Hyderabad : నేడు బక్రీద్ .. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఈరోజు ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలను జరుపుకునేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలున్న ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు అది గమనించి అటు వైపు వెళ్లాలని పోలీసులు ముందుగానే సూచిస్తున్నారు.

Chandrababu : నేడు పోలవవరం ప్రాజెక్టుకు చంద్రబాబు

ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు వద్దకు నేరుగా వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. తన క్షేత్రస్థాయి పర్యటన పోలవరం ప్రాజెక్టుతోనే ప్రారంభమవుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

Tags:    

Similar News