20May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్- అజర్ బైజాన్ సరిహద్దుల్లో రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అటవీ ప్రాంతంలో జరగడంతో శకలాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. ప్రతి కూల వాతావరణంలో ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Update: 2024-05-20 13:22 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Iran : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్- అజర్ బైజాన్ సరిహద్దుల్లో రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అటవీ ప్రాంతంలో జరగడంతో శకలాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. ప్రతి కూల వాతావరణంలో ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Ap Elections : వేమిరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి గెలుపు ఎవరది? ..చివరకు టెన్షన్ తప్పదా?

వైసీపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సీట్ల గెలుపుపైనే చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో పదికి పది స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఫ్యాన్ గిరగిరా తిరిగింది. కానీ ఈసారి నెల్లూరులో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై భారీ ఎత్తున బెట్టింగ్ లు పోలింగ్ పూర్తయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఎంత స్థాయిలో అంటే ఏపీలోనే ఏ నియోజవకర్గంలో జరగని బెట్టింగ్ లు నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంపై నడుస్తున్నాయి.

Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ కు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఉప్పందిందా? లేక జోస్యమా?

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరుంది. అనేక రాష్ట్రాల్లో ఆయన అందించిన వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చారు. దానిని ఎవరూ కాదనలేరు. 2019 ఎన్నికల్లో వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగానే వ్యవహరించారు. అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్రను తోసిపుచ్చలేం. అలాగే పొరుగున ఉన్న తమిళనాడు తో పాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి.

Ap Elections : వసంతను వదులుకుని తప్పుచేశారా? వైసీపీ ప్రయోగం సక్సెస్ అయ్యేట్లు లేదుగా?

మైలవరం నియోకవర్గంలో ఈసారి వైసీపీ ప్రయోగం చేసిందనే చెప్పాలి. కమ్మ సామాజికవర్గం గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో వారి ఆధిపత్యానికి గండికొట్టాలని భావించి వైసీప అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కమ్మ సామాజికవర్గం నేతలే ఎన్నికవతూ వస్తున్నారు. ఏ పార్టీ అయినా వారికే టిక్కెట్లు కేటటాయిస్తూ వస్తుంది.

Breaking : కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజుతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.

తొలి అంతరిక్ష పర్యాటకుడు మన బెజవాడ వాసి గోపీచంద్

రోదసీ యాత్రకు వెళ్లి వచ్చిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా తోటకూర గోపిచంద్ నిలిచారు. మే 19వ తేదీన ఆయన రోదసీయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. విజయవాడకు చెందని తోటకూర గోపిచంద్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షఎపర్ట్ 25 వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రను చేసి వచ్చారు.

Breaking : బెంగళూరులో రేవ్ పార్టీ... ఏపీ ఎమ్మెల్యే అనుచరులేనని అనుమానం

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగురాష్ట్రాలకు చెందిన వారు అరెస్టయ్యారు. టాలీవుడ్ కు చెందిన కొందరితో పాటు యువతులు కూడా పట్టుబడినట్లు తెలిసింది. బెంగళూరులోని వ్యాపారవేత్తకు సంబంధించిన ఫాం హౌస్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఏపీ, తెలంగాణల నుంచి యువతీ, యువకులను అక్కడికి విమానంలో తరలించారు.

ఛత్తీస్‌గడ్ లో ఎదురు కాల్పులు.. మావో, పోలీసులకు మధ్య

ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరొక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలయిన జవానును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలోని బేడా సమీపంలో ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Palnadu : జూన్ 5 వరకూ పల్నాడులో 144 సెక్షన్

ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ గా తనను నియమించిందరి జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు లో జరిగిన సంఘటనలు దేశం లోనే చర్చ నియాంశంగా మారిందన్నారు. పల్నాడు లో జూన్ 4వ తేదీన కొంటింగ్ సజావుగా జరిగేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామన్నారు.

ట్రోలింగ్ తట్టుకోలేక మరొకరు బలి... ఒక తల్లి బలవన్మరణం

చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ తట్టుకోలేక ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్ లో గోడ అంచు చివరకు చిన్నారి చేరుకుంది. ఆ చిన్నారిని కాపాడటానికి సమీపంలోని వారు అనేక ప్రయత్నాలు చేశారు. కింద పడితే గాయాలపాలు కాకుండా ఉండేందుకు దుప్పట్లు ఉంచారు. అలాగే మరొక వ్యక్తి గోడమీదకు ఎక్కి ఆ చిన్నారిని చివరకు ప్రాణాలతో రక్షించగలిగారు. కథ సుఖాంతమయింది.


Tags:    

Similar News