20June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
బీహార్ లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా కోర్టు తప్పు పట్టుపట్టింది. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని పాట్నా హైకోర్టు పేర్కొంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
పాట్నా హైకోర్టు సంచలన తీర్పు
బీహార్ లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా కోర్టు తప్పు పట్టుపట్టింది. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని పాట్నా హైకోర్టు పేర్కొంది.
Nara Lokesh : లోకేష్ సచివాలయానికి ఎందుకు రావడం లేదు.. రీజన్ ఇదేనా?
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంత్రి అయ్యారు. అయితే ఆయన పదవీ బాధ్యతలను ఇప్పటి వరకూ చేపట్టలేదు. సచివాలయానికి రావడం లేదు. అందరు మంత్రులు మంచి ముహూర్తం చూసుకుని తమ ఛాంబర్ లలో పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం ఇంకా పదవీ బాధ్యతలను స్వీకరించలేదు.
Andhra Pradesh : అమ్మో ఒకటో తారీఖు... కొత్త ప్రభుత్వానికి ఒకటోతేదీ వస్తుందంటే హార్ట్ బీట్ పెరుగుతుందిగా
ఆంధప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒకటో తేదీ భయం పట్టుకుంది. ఒకటోతేదీ వస్తుందంటే పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాల్ గా మారింది.
Pawan Kalyan : ఆ అధికారులకు పవన్ వార్నింగ్ .. మామూలుగా లేదుగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఎదురుకాకుండా చూడాలని ఆయన నిన్న జరిపిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Capial Amaravathi : రాజధాని అమరావతిలో భూముల ధరల పెరుగుదలో నిజమెంత?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్న ప్రచారంలో నిజమెంత అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భూముల ధరలు పెరిగిపోయాయని విపరీతమైన క్యాంపెయిన్ జరిగింది.
రుషికొండ ప్యాలెస్ పై షర్మిల హాట్ కామెంట్స్
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆమె అన్నారు. ప్రజల సొమ్మును వాళ్ల సమస్యలను తీర్చడానికి కాకుండా నేతల అవసరాలకు వినియోగించడం దారుణమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
Chandrababu : అమరావతిలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన కొనసాగుతుంది. కూల్చివేసిన ప్రజా వేదిక నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద వ్యర్థాలను అలాగే ఉంచాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం శాడిజాన్ని ప్రజలు తెలుసుకోవాలంటే దానిని అలాగే ఉంచాలని చంద్రబాబు అధికారులతో అన్నారు.
ఆల్ఫా.. హోటల్ లో ఇదేందయ్యా?
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్ అంటే ఫేమస్. ఇక్కడ భోజనం చేసేందుకు అనేక మంది వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆల్ఫా హోటల్ లో బిర్యానీ తిని, చాయ్ తాగాలని భావిస్తారు.
Breaking : హైదరాబాద్ మెట్టుగూడలో రైలు ప్రమాదం.. ఏసీ బోగీల్లో మంటలు
హైదరాబాద్ మెట్టుగూడలో రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బ్రడ్జి కింద వెళుతున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు ఏసీ బోగీల నుంచి మంటలు ఎగసి పడటంతో వెంటనే రైలును నిలిపేశారు. అయితే ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు నిర్వహిస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మహీపాల్ రెడ్డి గెలిచారు.