26May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటులో కూటమి పార్టీలకు ఊరట లభించింది. బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా.. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్ వాలిడ్ చేయకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

Update: 2024-05-26 12:49 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Ap Elections : పోస్టల్ బ్యాలట్ విషయంలో కూటమి పార్టీలకు బిగ్ రిలీఫ్

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటులో కూటమి పార్టీలకు ఊరట లభించింది. బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా.. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్ వాలిడ్ చేయకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

Ap Elections : బాబాయ్ .. ఈసారి ఎవరు గెలిచినా ఇంకొకరికి మాత్రం దబిడి దిబిడి తప్పదట

ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజకీయాలను మించిపోయాయి. ఇప్పుడు తమిళనాడు కాదు... ఒకప్పుడు కరుణానిధి, జయలలిత ఉన్న హయాంలో మాదిరిగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు తయారయ్యాయి. అధికారంలో ఎవరు వచ్చినా విపక్ష నేతలను కట్టడి చేయడానికే అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. జైలుకు పంపడానికి కూడా వెనకాడరు. ఉన్న కేసులు తిరగదోడటం.. కొత్త కేసులు పెట్టడం వంటి వాటిలో ఏమాత్రం వెనక్కు తగ్గని విధంగా ఉంటారు.

BRS : బీఆర్ఎస్ అంచనాలు ఇవేనా..? ఈసారి సిక్సర్ స్టాండ్ దాటి వెళుతుందా?

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి అత్యధిక స్థానాలు వస్తాయన్న విష‍యంలో మాత్రం అనేక రకాలు అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సాధిస్తుందని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా గతం కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వచ్చే అవకాశముందన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తుండటం విశేషం.

IPL 2024 : క్రీడా పండితులకు సయితం నాడి అందడం లేదే.. గ్రౌండ్ లో ఈరోజు ఎవరిదంటే?

ఐపీఎల్ లో ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది అన్న అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్ లో క్రీడానిపుణులకు సయితం నాడి దొరకలేదు. తాము అంచనా వేసిన జట్లు ఫైనల్స్ కు చేరుకోలేదు. అంచనాలన్నీ రాంగ్ అయ్యాయి. అందుకే ఫైనల్స్ లోనూ ఏ జట్టు గెలుస్తుందని ముందుగా అంచనా వేయడం కష‌్టమే.

Rajkot : ప్రజల ప్రాణాలతో గేమ్సా? ఉసురు తీసిన నిర్లక్ష్యం..రాజ్‌కోట్ ప్రమాదానికి అసలు కారణం ఇదేనట

రాజ్‌కోట్ ప్రమాదం ఊహించని రీతిలో జరిగింది. 27 మంది ఉసురు తీసింది. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వెళ్లిన వారికి అది డెత్ గేమింగ్ గా మారింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో నిన్న సాయంత్రం గేమింగ్ జోన్ లో చెలరేగిన మంటలకు 27 మంది మరణించారు. మంటలు వ్యాపించడంతో పై కప్పు కూలడంతో ఈ విషాదం తీవ్రత ఎక్కువయింది. తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు. రక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి. చుట్టూ మంటలు..

Remal Cyclone : తుపాను దూసుకొస్తుంది... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి రెమాల్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రికే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను గా బలపడింది. దీంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ అధికరులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని ఖెపుపరా కు నైరుతి దిశలో, పశ్చిమ బెంగాల్ కు చెందిన సాగర్ దీవులకు ఆగ్రేయంగా కేంద్రీకతమై ఉందని వాతావరణ శాఖ అధకారులు తెలిపారు.

Aadhaar Card : ఆధార్ కార్డుపై వదంతులు నమ్మొద్దు

ఆధార్ కార్డుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీన తర్వాత ఆధార్ కార్డు పనిచేయదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. దీనిని UIDAI ఖండించింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దంటూ ఒక ప్రకటనలో తెలిపింది.

రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలకృష్ణ ఆయనను కలవలేదు. సినిమా షూటింగ్ లు తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆయనను కలవలేకపోయారు.

ఆదివాసీ యువకుడి ప్రాణాలను కాపాడిన నిమ్స్ వైద్యులు

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆదివాసీ యువకుడి ప్రాణాన్ని కాపాడారు. దీంతో నిమ్స్ వైద్యులకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ వారి ప్రతిభను కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గడ్ లోని బీజాపూర్ కు చెందిన గుత్తికోయ గిరిజన తెగకు చెందిన సోది నందా అనే యువకుడికి ఛాతీలో బాణం దిగింది. అయితే అది గుండెకు దగ్గరగా చేరడంతో వైద్యులు శ్రమించి దానిని తొలగించారు.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం .. 11 మంది స్పాట్ డెడ్

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని షాజహన్‌పుర జిల్లాలో ఖుతర్ వద్ద ఈరోజు తెల్లవారు జామున బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి గాయాలయ్యాయి.


Tags:    

Similar News