26June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
లోక్‌సభ స్పీకర్ గా రెండోసారి ఓంబిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓంబిర్లా స్పీకర్ గా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Loksabha Speaker : లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్ గా రెండోసారి ఓంబిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓంబిర్లా స్పీకర్ గా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.
YSRCP : నవీన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. వైసీపీకి లాభం చేకూరుస్తుందా?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో మిత్రపక్షాలపై ఆధారపడి పని చేయాల్సి ఉంది. ప్రధానంగా లోక్‌సభలో టీడీపీ, జేడీయూల మద్దతుతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇద్దరు సీనియర్ నేతలు.. ఒకరు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కాగా, మరొకరు సీనియర్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
Purandhreswari : చిన్నమ్మకు పదవి చేజారి పోవడానికి కారణం అదేనా?
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పడటంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదవుల పంపిణీ జరిగిపోయింది. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ లో అన్ని పార్టీలకూ అవకాశం కల్పించారు కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు అవకాశమివ్వకపోయినా కూటమిలోని టీడీపీకి మాత్రం రెండు పదవులు లభించాయి.
America : భారీ వరదలతోజనజీవనం అస్తవ్యస్థం.. బీభత్సంతగా మారిన రాష్ట్రాలివే
అమెరికాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలుతో అస్తవ్యస్థంగా మారింది. అనేక మంది సురక్షిత ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. నదులు ఉప్పొంగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Chandrababu : కుప్పం నియోజకవర్గంలో ప్రజలతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. చంద్రబాబుకు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు. మహిళలు, వృద్ధులు తరలిరావడంతో అందరి నుంచి చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరించారు.
BRS : తెలంగాణ భవన్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణ భవన్ కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల వలయం నుంచి తప్పించుకొని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ, అందుకు ఈరోజు తెలంగాణ భవన్ నుండి ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర టెంపుల్ వరకు పాదయాత్ర చేసి తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్దం అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి.
Telangana : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పు
తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. ఈ నెల 27వ తేదీ నుంచి బీటెక్ లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని ప్రకటించారు. అయితే దీనిని జులై 4వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.
స్పీకర్ పై జగన్ కు అంత వ్యతిరేకత ఎందుకు?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు జగన్ లేఖ రాయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. అర్హత లేకపోయినప్పటికీ జగన్ కు అసెంబ్లీలో గౌరవం లభించిందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
kejrival : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా, ఆయన లోక్‌సభ ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్ పై ప్రచారం కోసం బయటకు వచ్చారు.
Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. అత్యవసరంగా రావాలంటూ?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి బయలుదేరి రావాలని కోరారు. మధ్యాహ్నం నుంచి జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్టు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.