3June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో గోడ కూలి నలుగురు మృతి చెందారు. రాజేంద్ర నగర్ లోని . మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్‌లో గోడ కూలిపోయి నలుగురు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : హైదరాబాద్ లో విషాదం.. గోడకూలి నలుగురి మృతి
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో గోడ కూలి నలుగురు మృతి చెందారు. రాజేంద్ర నగర్ లోని . మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్‌లో గోడ కూలిపోయి నలుగురు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Ap Elections Result : ఆరా మస్తాన్ కు ఇంత మంది ఫోన్ చేశారా? ఆయన ఫోన్ లో మిస్ డ్ కాల్స్ ఎవరివో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జాతీయ మీడియా సంస్థలను పక్కన పెడితే స్థానికంగా క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్ కు చెందిన సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఆరా మస్తాన్ ది సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆయనకు అన్ని పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి.
Ap Elections Counting : ఏపీకి వెళ్లకపోవడమే మంచిది.. ఎవరి ఊరిలో వారు ఉండటం ఉత్తమం లేకుంటే?
ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు. దీంతో పోలీసులు అన్ని ప్రాంతాలలో మొహరించారు. ఎంతగా అంటే వ్యాపారాలు బంద్ చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కౌంటింగ్ తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. బయట వారిని ఎవరినీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వడం లేదు.
Ap Elections : సోమిరెడ్డికి ఆపి మరీ టిక్కెట్ ఇచ్చారు సరే.. కానీ అక్కడ అసలు జరిగిందేమిటి?
నెల్లూరు రాజకీయాల్లోనే కాదు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన పార్టీకి బలమైన వాయిస్. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే లీడర్. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గం ఆదరించడం లేదు. ఒకటా.. రెండా.. దాదాపు రెండున్నర దశాబ్దా లనుంచి ఆయనకు గెలుపు అనే మాట వినపడటం లేదు.
Ap Elections Counting : బాబాయ్ బీపీ పెరిగిపోతుందిగా... నాడి దొరకడం లేదు...నరాలు చిట్లేంత ఉత్కంఠ మునుపెన్నడూ లేదే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అందరిలోనూ టెన్షన్. ఒకరు కాదు.. ఇద్దరు.. కాదు.. వేలు కాదు.. లక్షల్లో పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకూ ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. బీపీ పెరిగిపోతుంది. నరాలు చిట్లిపోతున్నాయి. ఇలా అనేక మంది ఉత్కంఠతో ఎదురు చూడటం గతంలో ఎప్పుడూ పడలేదంటున్నారు.
Ap Elections : జెండాలు వేరైనా.. అజెండాలు ఒక్కటేనన్నా.. జనం నమ్ముతారా గ్రౌండ్ రిపోర్ ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది. అయితే నల్లారి సోదరుల గెలుపోటములపై రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతుంది. ఎందుకంటే తొలిసారి ఇద్దరు బ్రదర్స్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటి వరకూ ఒకరు పోటీ చేస్తే మరొకరికి అండగా నిలవడం మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ ఈసారి ఇద్దరూ ఎన్నికల బరిలో ఉన్నారు. 2014 కు ముందు వరకూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే రాజకీయాల్లో ఉండేవారు.
Breaking : సుప్రీంకోర్టులో వైసీపీకి షాక్.. పిటీషన్ ను తిరస్కరించిన ధర్మాసనం
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బతగిలింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో తాము జోక్యంచేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో తాము విభేదించలేమని పేర్కొంది. పోస్టల్ బ్యాలట్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది.
Adani : అంబానీని మళ్లీ దాటేసిన అదానీ.. అపర కుబేరుడిగా మారి
ధనవంతుల జాబితాలో కొందరే ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారే. అందులో మన దేశంలో కొందరు మాత్రమే అత్యంత ధనవంతులున్నారు. వారిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారి పేర్లు ఎక్కువగా వినపడుతుంటాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ఈ మేరకు ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించింది.
America : అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన యువతి అదృశ్యమయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉణ్నారు. కందుల నితీషా మే 28వ తేదీ నుంచి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
Breaking కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. మూడున్నర నెలల నుంచి జైలులోనే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. కల్వకుంట్ల కవిత నేటితో ముగిసింది. దీంతో కవితను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11వతేదీన సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.