30May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ముంబయి వాసులకు బ్యాడ్ న్యూస్. ముంబయి వాసులకు మూడు రోజుల పాటు లోకల్ రైళ్లు అందుబాటులో ఉండవు. ముంబయి లో జరుగుతున్న పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్ పడనుంది. ముంబై నెట్‌వర్క్‌లో ప్లాట్‌ఫాం విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుంచి 63 గంటల మెగా బ్లాక్‌ను నిర్వహించనుంది.

Update: 2024-05-30 12:16 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Ap Elections : మెంటల్ ఎక్కిపోతుంది సామీ..ఓట్ల బదిలీపై టెన్షన్.. ఎందుకిలా అయిపోయింది బాబయ్యా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది. మరో ఆరు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అంచనాలు మాత్రం ఎవరివి వాళ్లవే. ప్రధానంగా కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం పీక్ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే పోలింగ్ జరిగిన తర్వాత కొత్త సందేహాలు మొదలయ్యాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ పది స్థానాలు, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది.

Ap Elections : జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం.. ప్రయాణం ఉంటే వాయిదా వేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4వ తేదీన బంద్ వాతావరణం ఏర్పడనుంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాాల్లో బందోబస్తును తీవ్రతరం చేశారు. 

Ap Elections: సెంటిమెంట్ వర్క్‌అవుట్ అయితే ఎవరికి లాభం.. జగన్ కా? చంద్రబాబుకా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు కొనసాగుతున్నాయి. కూటమి ఏర్పాటయితే ఖచ్చితంగా గెలుస్తుందా? ఒకే పార్టీని రెండు దఫాలు ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల వేళ ఇప్పుడు జనంలో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకటి కాదు రెండు రకాల సెంటిమెంట్లు తెలంగాణలో కనిపించాయి. 1990వ దశకం నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది.

Mumbai : మూడు రోజులపాటు రైళ్లన్నీ బంద్

ముంబయి వాసులకు బ్యాడ్ న్యూస్. ముంబయి వాసులకు మూడు రోజుల పాటు లోకల్ రైళ్లు అందుబాటులో ఉండవు. ముంబయి లో జరుగుతున్న పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్ పడనుంది. ముంబై నెట్‌వర్క్‌లో ప్లాట్‌ఫాం విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుంచి 63 గంటల మెగా బ్లాక్‌ను నిర్వహించనుంది.

Delhi : మండిపోతున్న ఉత్తర భారతం.. బయట కాలు పెడితే మసయినట్లేనట

రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న రాకతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు.

అమర్‌నాథ్ యాత్రికులకు జూన్ 1నుంచి నుంచి హెలికాప్టర్ సౌకర్యం

అమర్నాథ్ యాత్రికుల కోసం జూన్ ఒకటో తేదీ నుంచి హెలికాప్టర్ బుకింగ్ అందుబాటులోకి రానుంది. అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్ లైన్ లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. అమర్నాధ్ యాత్రికులు హెలికాప్టర్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.

వరంగల్ బిషప్ తుమ్మ బాల హఠాన్మరణం

వరంగల్ బిషప్ తుమ్మ బాల ఈరోజు తుది శ్వాస విడిచారు. ఉదయం 10.25 గంటలకు డియోసిస్ బిషప్ మోస్ట్ రెవ. తుమ్మ బాల మృతి చెందారు. ఆయన మృతితో ఒక సున్నిత, మంచి వ్యక్తిని కోల్పోయినట్లయింది. తుమ్మ బాల వయసు 80 సంవత్సరాలు. ఆయన ఎంతో కష్టపడి, అంకిత భావంతో పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నారు.

T20 World Cup 2024 : మజా అంటే ఆరోజు కదా? ఆరోజు రోమాలు నిక్కబొడుచుకోక తప్పదా? రొమ్ము విరుచుకుంటామా?

టీ 20 వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీం ఇండియా సెమీస్ లోకి వెళుతుందని మాజీ క్రీడాకారులందరూ అంచనా వేస్తున్నారు. గ్రూపు ఎలో భారత్ సులువుగా బయటకు వచ్చి సెమీస్ లో అడుగుపెడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే టీ 20 కావడంతో ఆరోజు ఎవరిది పై చేయి అవుతుందో వారిదే ఆరోజు అవుతుంది. సమిష్టిగా రాణించగలిగితేనే ఏ జట్టుకయినా విజయావకాశాలుంటాయి.

Loksabha Elections : నేటితో చివరి దశ ఎన్నికల ప్రచారం సమాప్తం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. జూన్ 1వ తేదీన జరిగే చివరి విడత ఎన్నికలకు సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా ఎన్నికలు జరిగాయి. చివరి దశ మాత్రం జూన్ ఒకటో తేదీన 57 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Narendra Modi : నేడు కన్యాకుమారికి మోదీ.. మూడు రోజులు ధ్యానంలోనే

నేడు కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోదీ కన్యాకుమారిలోనే ఉండనున్నారు. జూన్ 1వ తేదీ వరకూ అక్కడే ధ్యానం చేస్తూ గడపాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈరోజుతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. కొన్ని నెలలుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మనసు ప్రశాంతత కోసం కన్యాకుమారికి చేరుకుంటున్నారు.

Tags:    

Similar News